Tuesday 28 February 2012

వాయులీనం!

స్వయం పాకం అయినదాన్ని తినడానికి దమ్ము ఉన్నవాడు సొంత ఆలోచనల్ని నిర్భయంగా పంచుకో వచ్చని ఎప్పుడో మా బామ్మ చెప్పింది. ( ఆవిడ ఇందిరా గాన్ధీ కాదూ సినిమాలో నిర్మలమ్మా కాదూ). అందుకే ఈ పక్కింటి పుల్లకూర స్వయం గా వండటం! ;)
అందమంతా తానే అని మిడిసిపడే పువ్వైనా, ఏ తప్పూ చేయకుండా ఒళ్ళంతా ముళ్ళు నింపుకున్న బ్రహ్మజెముడైన, జీవనం సాగాల్సిందే... నిముషాలు గడపాల్సిందే!
లాగిపెట్టి ఉన్న తీగలని సుతారంగా తాకితే సరాగాలు పలికినట్టు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవితం పలికే రాగాలు వినాల్సిందే వినిపించాల్సిదే వాయువు లో లీనం అయ్యెవరకూ!
ఈ మద్య లో వినిపించే రాగాల ఆలాపనే ఈ "వాయులీనం" ! :)